పుట:మధుర గీతికలు.pdf/431

ఈ పుట ఆమోదించబడ్డది




ముక్కు పక్షము వాదింతు మొట్టమొదట;
తరతరంబులనుండి అద్దాలజోడు
పూనుచున్నది కావున, ముక్కె దాని
హక్కుభుక్తము లన్నియు ననుభవించు"

అనుచు వచియించి, యా సులోచనము నెత్తి,
తనదు ముక్కున ధరియించి, అనియె నిట్లు:
'అరసితిరె దీనినడుమ నున్నటి పంపు
చక్కఁగా నెట్టు లమరెనో ముక్కుచుట్టు?

ఇంత యేటికి - ముక్కు లేదేని, నరుఁడు
దాని నేరీతి నెచ్చోట దాల్చఁగలఁడు?
ఇందుబట్టి విచారింప నెవరి హక్కొ,
తేటతెల్లముగా మీకె తెలియఁగలదు.

పెక్కుమాట లిఁ కేల - ఇంకొక్కమాట
లోన విరమించుచుంటి; సులోచనంబు
నిక్కముగఁ జేయఁబడినది ముక్కుకొఱకె,
ధాత నిర్మించె ముక్కును దానికొఱకె. '

58