పుట:మధుర గీతికలు.pdf/430

ఈ పుట ఆమోదించబడ్డది




చతురమతియును విజ్ఞానయుతుఁడు నీతి
మంతుఁడగు నాల్కయే వారి మధ్యవర్తి;
అఖిలశాస్త్రవిశారదుఁ డైన చెవిని
వారు న్యాయాధికారిగా కోరుకొనిరి.

ధర్మదేవత యెదుట ప్రత్యక్ష మయ్యె
ననఁగ, కూర్చుండె చెవి యున్న తాసనమున;
నిండుకొలువున వాని సన్నిధిని నిలిచి,
వినయమున నాల్క యిట్లని విన్న వించె:

"అవధరింపుడు - దేవరా! సావధాన
చిత్తమున నాదు వాదము చిత్తగించి,
మేలు మే లని యెల్లరు మెచ్చుకొనఁగ
మీఁద సెలవిచ్చెదరు గాక మీదు తీర్పు.

ఉభయ పక్షమువారల యోగ్యతలును
చక్కఁగా పరామర్శించి చర్చ చేసి,
ఓలి సారాంశములఁ దేల్చి, యుష్మదీయ
దివ్యచిత్తమునకు నివేదించువాఁడ.