పుట:మధుర గీతికలు.pdf/43

ఈ పుట ఆమోదించబడ్డది

32

భారతంలో కర్ణపాత్రపై ఆయనకు ఎక్కువ మక్కువ ! ఆ కారణంగా తన కుమర్తె అయిన లక్ష్మీకాన్తమ్మచే భారతంలో కర్ణపాత్ర గల ఘట్టాలను చదివించు కొన్నారు.


త్యాగరాయ కీర్తనలపై గల ప్రీతి పెంపున కుమార్తెను వీణ పై త్యాగరాయ కీ ర్తనలు వాయించమని అడిగి, విని, ఎంతో సంతృప్తి పడినారు.


ఆ అంత్య సమయంలో ఎన్నో మార్లు బ్రాహ్మమత కీర్తనలు పాడమని కుమార్తె నడగడమూ ఆమె పాడడమూ జరిగింది, ఇంక రేపురాత్రి మరణిస్తారనగా క్రమక్రమంగా స్మృతి తప్పుతూ వచ్చింది. ఆఖరు రోజున కుమార్తె లక్ష్మీకాన్తమ్మ ఉదయమే బ్రాహ్మ ధర్మ కీర్తనలు పాడడం ప్రారంభించగా, మూసుకు పోయిన కండ్లు తెఱచుకొని, గోడవైపు తిరిగి పోయిన తలను కుమా ర్తె వైపు త్రిప్పి పాటలు విన్నారు. రాత్రి 11-45 వఱకూ ఆమె పాడుతూనే ఉన్నారు. ఆయన వింటూనే ఉన్నారు. తర్వాత 12 దాటిన కొద్ది సేపటికి ఆ పుణ్యమూర్తి, ఈశ్వర సేవకుడు, సంఘోద్ధారకుడు, భాషావేత్త, మధుర కవి సత్తముడు, గౌతమీ గ్రంథాలయ ప్రతిష్ఠాపకుడు, ఆంధ్రమాత అనుగు పుత్రుడు తుదిశ్వాస విడచినారు.


ఇది వారి జీవితచరిత్ర కాక, శతజయంతి సంఘము వారి ప్రశంస యగుటచే ప్రధానమైన వారిజీవిత విశేషములను పేర్కొ నుటయే జరిగినది