పుట:మధుర గీతికలు.pdf/429

ఈ పుట ఆమోదించబడ్డది

ముక్కు-కన్ను సంవాదము



వినుఁడు, జనులార ! వినిపింతు వింతకతను-
'ముక్కు కన్ను వివాదంబు' ముచ్చటలర,
అల ‘సులోచన' మెవ్వరి హక్కటంచు
కలహమాడిరి వారలు చలము మీఱ.

'కళ్లజో' డని పిలుతురు కాన, దాని
హక్కు నా దని వాదంబులాడె కన్ను:
అందరును దాని ‘ముక్కద్ద' మండ్రు గాన,
నాది హక్కని నాసిక వాద మాడె.

ఏరితో చెప్పుకొన్నను వారి తగవు
అంతకంతకు నతిశయం బగుటె కాని,
దాని తీర్చెడువా రెందుఁ గానరామి,
అరిగి రంతట నిరువురు న్యాయసభకు.

56