పుట:మధుర గీతికలు.pdf/427

ఈ పుట ఆమోదించబడ్డది





అతఁడు నాకయి గావించినట్టిరీతి
అతనికొఱకయి నేనును నాచరింప,
ఒంటిగాఁ గాననంబుల వెంటఁ దిరిగి
ఎటులొ గ్రుక్కెడు ప్రాణంబు లీఁగుదాన."

"పాపము శమించుఁ గాక నా 'ప్రమదరాణి '
ఎట్టి సాహసమున కొడిగట్టినావు :
అనుచు నామెను బిగికౌఁగిటను గదించి
ఇట్టులనే యోగి యనురాగ ముట్టిపడఁగ :


"రమణి మిన్నరొ నీదు సర్వస్వ మెల్ల
నెవని కొఱకయి త్యజియింవ నెంచినావో,
అమ్మహాభాగ్యరాశి 'సుధాకరుండు'
నిల్చియున్నాఁడు జీవమ్ము దాల్చి యిడుగొ :

నేఁడు మొదలుగ గడెయైన వీడకుండ
అరమరలు లేని కూర్ముల ననఁగి పెనఁగి,
కొదలు దీరని కోర్కులఁ గూడి మాడి
వలవు లిగురొత్త నుందము కలసి మెలసి.".

54