పుట:మధుర గీతికలు.pdf/424

ఈ పుట ఆమోదించబడ్డది



అంచు నా మౌనియింక వచించుచుండ,
పెదవులదరంగ,మానస మదవదవడ,
ఉస్సురుసు రని వేడి నిట్టూర్చు పుచ్చి
ఏమి పలుకక బాలుండు మోము త్రిప్పె.

ఔర! ఎటనుండి వచ్చెనో యతని కంత
బెళుకుచూపులు, నునుసిగ్గు, కులుకునడలు;
ఉన్నయటు లుండి యా బాలుఁ డొక్కసారి
సుదతిగా మాఱె తద్దయు చోద్య మొప్ప.

చరణముల నేల వ్రాయుచు, శిరము వంచి,
గద్గదిక తొట్రుపాటును గడలుకొనఁగ,
పలికె నా బాల సన్నని యెలుఁగుతోడ
పలుకు పలుకునఁ దేనియ తొలుకుచుండ.

‘దిక్కుమాలినయట్టి యీ దీనురాలి
నేరముల నెల్ల నీవు మన్నింపు మయ్యః
ఈవు దేవుఁడు వసియించు నీ కుటీర
సీమ నపవిత్రపఱచితి, చేరి నేను.

51