పుట:మధుర గీతికలు.pdf/423

ఈ పుట ఆమోదించబడ్డది



అతని పరితాపమును గాంచి యతివరుండు
జాలిగొని తాను వానితోఁ కాలుగొనుచు,
పలికె. నీరీతి కూరిమి మొలకలెత్త,
"ఏల యీలీల నేడ్చెదు బేలవోలె?

గెంటిరే నిన్ను తలిదండ్రు లింటి నుండి?
పలచితివె వైరివరులకు వెఱచి నీవు?
ఆదరింపదె ప్రియురాలు నీదు వలపు
డెందమున నిట్లు కొందల మంద నేల?

జగతియందలి సౌఖ్యనంచయము లెల్ల
శాశ్వతంబులు గా, వవి నశ్వరములు;
అల్ప మగు వాని నాసించి యఖిలజనులు
భంగపడెదరు వానిని బడయలేక.

ప్రేమ యనునది యక్కటా: వెఱ్ఱి కాదె-ః
పై మెఱుంగులఁ గాంచి విభ్రాంతి చెంది
రమణిఁ బ్రేమింప, నామె నిరాకరించు;
ఎండమావుల వంటిది యింతివలపు."

50