పుట:మధుర గీతికలు.pdf/422

ఈ పుట ఆమోదించబడ్డది



లోన నడుగిడినంతనే మౌనివరుఁడు
గూటిలో నున్న దీపంబు కొడిని రాల్చి
పొయ్యిలోవలి నిప్పుల బుగులుకొలిపి,
పీటమీఁదను కూర్చుండఁబెట్టె నతని,

అరటియాకున వివిధభక్ష్యముల నునిచి
కోరికలు మీఱ ‘వడ్డించి కొసరి కొసరి,
వానిచెంగటఁ గూర్చుండె మౌనివరుఁడు
చిఱునగవు నెమ్మొగమ్మున తురగలింప

మలయపవనుండు మెలమెల్ల మలయుచుండె,...
కమ్మతావులఁ గుసుమముల్ గుమ్మరించె,
కొదమకోయిల కో యని కూయ సాగె,
నింగిపై నుండి జాబిల్లి తొంగి చూచె..

వీని యన్నిట పథికుని మానసంబు
లోని నెవ్వగ లుపశమిల్లుటకు మాఱు.
అంతకంతకు పెల్లుగా నతిశయిల్లి
కనుల వెంబడి బాష్పముల్ కాల్వగట్టె

46