పుట:మధుర గీతికలు.pdf/421

ఈ పుట ఆమోదించబడ్డది



తెరువరీ : నీదు వెత లెల్ల మఱచి పొమ్ము --
ఐహికంబగు కోరిక లస్థిరములు;
జనుల వాంఛలు స్వల్పముల్ జగతియందు,
వాని నెల్లను సమకూర్చ వనమె చాలు.'

చల్ల నగు మంచు బిందులు చదలనుండి
తొరఁగు కరణిని, సంయమివరుని మధుర
భాషణంబులు తొలుకాడ,బాటసారి
మాఱు పలుకక వెడలె నామౌని వెంట.

దట్టమైనట్టి యా కాన నట్టనడుమ
కొండచెంగట నా పూరిగుడిసె యలరె,
పతితజనముల పాలిటి పట్టుకొమ్మ,
పేదవారల పాలిటి పెన్నిధి యయి..

ఎపుడు జలజల ప్రవహించు నేటిదరిని
అల్లిబిల్లిగ పూఁదీఁగ లల్లుకొనిన
ఆ కుటీరము చెంతకు నరిగి వారు
గడప దాటిరి కాంక్షలు నడలు కొనఁగ,

47