పుట:మధుర గీతికలు.pdf/420

ఈ పుట ఆమోదించబడ్డది



"ఈశ్వరుఁడు నీకు శుభముల నిచ్చుఁ గాక :
రాత్రివేళల భీకరారణ్యములను
సంచరింపకు పాంథుఁడా సాహసమున;
క్రూరమృగములు స్వేచ్ఛగాఁ గ్రుమ్మరిల్లు.

దారుణంబగు హృదయవేదనలఁ దూలి
సదనముల వీడి కానల సంచరించు
దీనజనులకు నేవేళ నైనఁ గాని
ఆశ్రయంబగు నా పేద యాశ్రమంబు,

బడలికలు వాయ నేఁడు నా గుడిసెలోన
మేను వాలిచి ప్రీతితో నే నొసంగు
ఆమెతల నెల్ల కడుపార నారగించి
విశ్రమింపుము నాదు దీవెనల నంది.

కొలడయడుగున పొలముల నుండి తెత్తు
పాలు కూరలు పండ్లు దుంపలు భుజింప;
పాన మొనరింప శుద్ధమౌ స్వాదుజలము,
పండుకొనుటకు వెచ్చని పరుపు నిత్తు.

47