పుట:మధుర గీతికలు.pdf/42

ఈ పుట ఆమోదించబడ్డది

31

వింతప్రకృతికల, ఈ విచిత్ర వ్యక్తిని, అన్నింటి యందును మిక్కిలి శక్తిసామర్ధ్యము ఊహాపోహములు, ఉచితజ్ఞ తకల యువతి సుశీలమ్మగారు వారి ధర్మపత్నిగా, గృహిణీ ధర్మములను కడుజాగరూకతతో నైపుణితో, నిర్వహించుకొన గల్గుట చేతనే కృష్ణరావుగారు సంసారమున తామరాకుపై, నీటి చందమున ప్రవర్తించినను, వారి కాపురము ఏ విధముగను రస భంగము కాక పోవుటయే కాదు, అత్యధిక వైభవ సముజ్జ్వలముగ సాగిపోయినది.

శ్రీకృష్ణరావుగారి అంత్య సమయాన్ని గూర్చి కొద్దిగా చెప్పవలసి యున్నది.

1961 ఏప్రియల్ 17వ తేదీ నాడు ఉగాది పర్వదిన ప్రవేశ సమయంలో వారు కన్నుమూశారు.

అంతకు ముందు సుమారు అయిదు సంవత్సరాలు కాలు విరుగుటచే వారు, మంచంపట్టి ఉండడం తటస్థించింది.

వయస్సు పెద్దదికావడం వలన 1961 నుండీ క్రమంగా వారికి బలహీనత హెచ్చుకావడం ఆరంభించింది..


ఏప్రియల్ 3 వ తేదీ నాడు మాటపడిపోయినది. ఆయినా వారు స్పృహ ఉన్నంత సేపు భారతం చదివించుకోవడం, రామా యణం చదివించుకొని వినడమూ మానలేదు. థియసాఫికల్ వారి “మరణానన్తర దశ” అనే గ్రంథం తెప్పించుకొని, తన మరణా నన్తరంతాను ఉత్తమ గతులకే పోగలననే ధైర్య విశ్వాసాలను, సంతృప్తినీ పొందారు.