పుట:మధుర గీతికలు.pdf/419

ఈ పుట ఆమోదించబడ్డది

విరాగి




“సంయమివరేణ్య : ఓ దీనజనశరణ్య !
ఘోరవనముల గాఢాంధకారమందు
తెన్ను దెలియక యొంటిమైఁ దిరుగుచుంటి.
కావుమా నన్ను దరిజేర్చి కరుణతోడ :

ఏమి చిత్రమొ కాని-ద వ్వేగు కొలఁది
ఘోర భీకర రవముల గోండ్రు మంచు
బొబ్బరింతలు పెట్టు బెబ్బులులే కాని,
కానరా దొక్కయి ల్లైన కానలోన.

అడుగు తడఁబడు, మె గడగడ వడంకు,
ఒక్క యడు గైన నడవంగ నోప నింక;
దవ్వుగా వెల్గుచున్నది దివ్వె యదిగో:
నన్ను గొనిపొమ్మ, అ దివ్వె యున్న యెడకు.”

46