పుట:మధుర గీతికలు.pdf/417

ఈ పుట ఆమోదించబడ్డది

నిర్ణయింపఁజాల



కమ్మతావుల నొలికించు తమ్మి జూచి
సుందర మ్మగు నీ మోము జూచినపుడు,
తమ్మి నెమ్మోమొ, నెమ్మోము తమ్మిపువ్వొ
నిర్ణయింపఁగ లే కట్టె నిలిచియుందు.

కోమలం బగు కలువరేకులను జూచి
సోగలగునీదు కన్నులఁ జూచునపుడు,
కలువరేకులు కన్నులో, కనులు కలువ
రేకులో నిర్ణయింపఁగ లేకయుందు.

లలిత మగు లేత చివురుగుత్తులను గాంచి
కమ్ర మగు నీదు కెమ్మోవి గాంచినపుడు,
లేఁతచివురులు మోవియో, లేక మోవి
లేఁతచివురులొ తెలియంగ లేకయుందు.

44