పుట:మధుర గీతికలు.pdf/415

ఈ పుట ఆమోదించబడ్డది

కోయిల - మిణుగురు




చల్ల నగు నొక్క యామని సంజవేళ
గుజ్జుమామిడిగున్న పై కూరుచుండి
వేడు కలరఁగ కోయిల పాడుచుండె,
ఎల్లజనముల యుల్లంబు లుల్లసిల్ల.

అంత కొంత సేపటి కది యలసి సొలసి
ఆకటను కుక్షి నకనక లాడుచుండ,
దెసలఁ బరికించి పొదలపై మసలుచున్న
పురుగు నొకదానిఁ గనుఁగొనె ముదము మీఱ.

మినుకు మిను కను కాంతులు మెఱయుచున్న
దాని మిణుఁగురుపురుగుగా నెఱింగి,
బాళిమై దాని నారగింపంగ నెంచి
ధరణిపై వ్రాలె కోకిల తరువునుండి.

42