పుట:మధుర గీతికలు.pdf/414

ఈ పుట ఆమోదించబడ్డది






హేయ మగు నూడిగము సేయ నిష్టపడక
సతత మీశ్వర సేవయు, సాధుగోష్ఠి,
గ్రంథపఠనంబు చేయుచు కాల మెల్ల
నిచ్చ మీఱఁగ నాతండు బుచ్చుచుండు.

వృద్ధి నొందఁగ నతని కపేక్ష లేదు,
పతన మొందఁగ నతనికి భయము లేదు;
ఏల లేకున్న జానెడు నేలయైన
సకల జగమున కాతఁడే చక్రవర్తి.

41