పుట:మధుర గీతికలు.pdf/413

ఈ పుట ఆమోదించబడ్డది

స్వతంత్ర జీవనుఁడు



ఒరుల యానకు దోసిలి యొగ్గనట్టి
వాఁడు ధన్యుఁడు, భాగ్యజీవనుఁ డతండు;
మంచిహృదయమె యాతని కంచుకంబు,
అమలవర్తనమే వాని యంగరక్ష.

చెడ్డపనులను చేయంగ సిద్దపడఁడు,
లోకనిందల కాతండు లోనుగాఁడు,
యశము నార్జిపంగా నతఁడాశఁ గొనఁడు,
మరణ మన్న నొకించుక వెఱపు గొనఁడు.

పరుల కైవారములు సేయఁ బాలువడఁడు,
ఉబ్బుమాటల కతఁడు తబ్బిబ్బు గాడు,
లేమి కల్గిన లేశంబు క్లేశపడఁడు,
ఒరుల సంపదల కసూయ నొందఁబోడు.

40