పుట:మధుర గీతికలు.pdf/410

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రేమ



గిరులమీఁదను, మబ్బుదొంతరలలోన,
కడలితరగలయందును, గహ్వరముల,
భూమిగర్భములోపల ప్రేమ జొచ్చు;
ప్రేమ చొరలేని చోటులు భూమిఁ గలవే ?

కాననంబుల', తారకాగణములందు,
తరణి చంద్రులయందు, పాతాళమందు
ప్రేమ ప్రవహించు నెల్లెడ - వేయి యేల -
ప్రేమ చొరరాని తావులు పృథిని లేవు.

గాలి కవియని నెలవులఁ గవియఁ గలదు
ఇరులు దూరని యిరవులఁ దిరుగఁగలదు,
కవియు రవియుఁ గానని చోట్లఁ గాంచఁ గలదు;
ప్రేమ చనలేని సీమ ధరిత్రిఁ గలదె?

37