పుట:మధుర గీతికలు.pdf/41

ఈ పుట ఆమోదించబడ్డది

30

ణుడు. క్రొత్తరాగముల గనుగొన్న నిపుణుడు. భార్య వనజా గుప్త, గొప్ప గాయనీ మణి బాల్యమునందే పోతన చలన చిత్ర మున పోతన కుమార్తె లక్ష్మిగా నటించి ప్రశంసలందిన ప్రజ్ఞా మతి ! ఆశామధుర్, ఉదయకిరణ్, అనిల కుమారులు, వీరిపుత్త్ర సంతానము.


శ్రీ నాళం కృష్ణరావుగారికి సంతాన నష్టమెక్కువగుట వలనను, సహజముగా పిన్నవయస్కులపై మక్కువ ఎక్కువ గుట వలనను, చాలా మంది పిల్లలకు ఉచితవేతనాద్యనేక సౌకర్య ములు కల్గించి, ఉన్నత విద్యల వఱకు చదువులు చెప్పించి, వారి బ్రతుకులు సుస్థిరములగుటకు తోడ్పడియున్నారు. అట్టి వారిలో మద్రాసులోని ఒక పెద్ద ఎడ్వర్టైజుమెంటు కంపెనీ మేనేజ రుగా పనిచేసిన శ్రీ సాల్యీ గోపాలరావుగారొకరు.


సేవా కార్యక్రమము లందును, సంఘ సంస్కారా చారణ విషయమునను శ్రీకృష్ణరావు గారెంత నిష్ణురుడో , ఎంత నిపుణమతియో, బాధ్యతాయుతమైన గార్హస్త్య కార్యకలాప నిర్వ హణమునందు అంత అంబేద: ఎల్లప్పుడును ఏదో ధ్యాన నిష్ఠలో నున్నారేమో యనిపించుచు, అన్య మనస్కుడై వీధులలో తిరు గాడు నపుడు, ఒక కాలిచెప్పు ఊడిపోయినను, కనుగొనలేని పరాకు మానిసి ! పిల్లలకు ఏదేని వ్యాధి ప్రమాదములు సంభ వించినను వెజ్జుని, పిల్చుట కూడా చేతకాక, మనోవేదనతో దిగులు పడి బాధపడునట్టి బేల !