పుట:మధుర గీతికలు.pdf/409

ఈ పుట ఆమోదించబడ్డది



అరరె నే నెంత, నీ వెంత? ఇరువురకును
హస్తిమశకాంతరము కాదె యరసి చూడ?
ఉప్పరం బంటు నా మేటి కొప్పరములు,
ఈవొ నేలకు బెత్తె డెత్తేని లేవు'

ఉడుత యా మాటల కొకింత యుదిలగొనక,
'అయ్య! పర్వతరాజ! నీ వన్నయట్లు,
అధికుఁడవు నీవు, అల్పుఁడ నగుదు నేను;
అయిన, ప్రజ్ఞలు తాఱుమా రగును గాదె

అవని నీ వెంత యధికుండ వైన నేమి,
మెదల నేరవు నీ వున్న మేరనుండి;
అరయ నే నెంత యల్పుఁడ నైనఁ గాని,
ధరణి యెల్లెడ చుఱుకుగాఁ దిరుగఁగలను.

నేను నీవలె పెద్దను గాను గాని,
నీవు నావలె చిన్నవు గావు చూనె
కటికిరాళ్లను మోయంగఁ గలవు కాని,
గుఱుములను నీవు నావలె కొఱకుఁ గలవేళ

36