పుట:మధుర గీతికలు.pdf/408

ఈ పుట ఆమోదించబడ్డది

పర్వతము - ఉడుత




వినుఁడు జనులార! చెప్పలే దనెద రేమొ-
చెప్పుచుంటిని మీ కిదే చిత్రకథను,
చిన్న దని దాని చులకన చేయవలదు;
చిట్టి దయ్యును మిరియంబు చెడునె ఘాటు.

అనఁగ ననగ నొకానొక యద్రి గలదు,
దానిశిఖరాలు తారాపథాల నంటు;
ఉడుత యొక్కటి దానిపై నున్న తరువు
మీఁది కెగఁబ్రాకి ఫలముల మెక్కుచుండె,

ఉడుతబుడుతఁడు దుడుకునఁ దొడరి సేయు..
దుండగంబుల కా కొండ మండిపడుచు,
ఇటు లనె దానితో “ఓసి తుట్టపురుగ!
కనులు గానవ!. నీ కింత కావరంబ?

35