పుట:మధుర గీతికలు.pdf/406

ఈ పుట ఆమోదించబడ్డది

సత్పురుషుఁడ




ఎవని యకలంక హృదయంబు హేయమైనవి.
యత్నములనుండి, పాపకార్యములనుండి..
దుష్టచింతనములనుండి దూర మగునొ,
వాఁడె రమణీయ నిర్మలవ ర్తనుండు.

వెతలు లేని ప్రశాంత జీవితము గడపి,
హాని యెఱుఁగని యానంద మనుభవించు,
లోనుగాఁ డాతఁ డెపుడు ప్రలోభములకు,
భేద మొందఁడు లేశంబు క్లేశములకు.

అరులదాడి నెదుర్కొన నాతఁ డెపుడు
కాంక్ష సేయఁడు కోటలు కవచములును;
అరులపై దాడి సలుపఁగ నాతఁ డెపుడు
వాంఛ “సేయఁడు ఖడ్గముల్ బల్లెములును.

33