పుట:మధుర గీతికలు.pdf/405

ఈ పుట ఆమోదించబడ్డది




పెక్కుబన్నము లొదవిన లెక్కగొనక
కడఁగి వేలుపు అమృతంబు బడయలేదె?
అట్టులే నీవు పట్టిన పట్టు విడక,
యత్న మొనరించి ఫలసిద్ధి నందు మయ్య.

భూరియత్న మొనర్చి భగీరథుండు
గంగఁ గొనితెచ్చె భువికి నాకముననుండి.
విఘ్నములు పెక్కు గలిగిన వెనుదివియక;
నిశ్చితార్ధము విడుతురే నిపుణముతులు?

సకల జనులను గావింపఁ జాలినట్టి
కార్యములు నీవు నెఱవేర్పఁ గలవు గాన,
పట్టుదలఁ బూని చేయుమా పనుల నెల్ల;
కాలమే నీకు సమకూర్పఁ గలదు ఫలము..

32