పుట:మధుర గీతికలు.pdf/404

ఈ పుట ఆమోదించబడ్డది

యత్నము





యత్న మొనరింపు సోదరా!అనుదినంబు;
తొలుదొలుత నీకు విజయంబు కలుగదేని,
పూన్కి వీడక ఫలసిద్ది పొందుదాక
జతన మొనరింపు క్రమ్మర, జయము కలుగు.

ధృతి దొలంగక, మదిని నిస్పృహను వీడి
కార్యసాఫల్య మగుదాక కడఁగు మయ్య;
జయము గాంతువు తప్పక, భయముపడకు,
సాయ మొనరించు దైవంబు సత్క్రియలకు.

పోరు గావించి రిపులతో బ్రూసురేఁడు
ఆరుసారులు నపజయ మంది, తుదకు
జయము గాంచఁడె ఏడవసారి పోరి
వైరివీరుల నెల్లను పాఱఁదోలి ?

31