పుట:మధుర గీతికలు.pdf/402

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకృతి - సృష్టికర్త




ఆ మహామహిమోన్నతం బైనయట్టి.
గగనతలమును, అందలి గ్రహగణంబు
ఈశు ఘనదివ్యలీలావిలాసములను
వేయివిధములఁ బ్రకటించు విశ్వమునకు.

దినదినంబు నభోవీథిఁ దిరిగి తిరిగి
తనదు కిరణంపురాజిచే ధరణి కెల్ల
దివ్యకాంతులు వెదజల్లి దినకరుండు
విశ్వనాథుని మహిమల వెల్లడించు.

సవితృఁ డస్తమించినయంత చందురుండు
చదలిమీఁదను వెలుఁగొంది చల్లనైన
పండువెన్నెల లెల్లెడ నిండఁజేసి
ప్రకృతిలీలల నెల్ల నుపన్యసించు.

29