పుట:మధుర గీతికలు.pdf/400

ఈ పుట ఆమోదించబడ్డది

నడపుమా!







ఓ నిరంతర దివ్యతేజోనిధాన!
దారి చూపుమ నీ సన్నిధానమునకు;
చిమ్మచీఁకటి దెసలెల్లఁ గ్రమ్ముకొనియె,
వడిగ వెలుతురులోనికి నడపు మయ్య:

దారి తప్పితి, దవ్వు నీ ధామ మిటకు,
అడుగు తడఁబడు, మై గడగడ వడంకు,
ఒక్క యడు గైన నడవంగ నోప నింక:
నడపుమా నీదు చేయూఁత నా కొసంగి.

దారిలో నిండి నిబిడీకృతముగ నుండె,
రాళ్ల గుట్టలు, బురదయు, ముళ్లపొదలు;
వాని దాటించి తెలతెల్లవారువేళ
రాజబాటను నన్ను జేర్పంగదయ్య

27