పుట:మధుర గీతికలు.pdf/40

ఈ పుట ఆమోదించబడ్డది

29

అందు ప్రధమ పుత్రుడు నాళము నాగేశ్వరరావు (B.sc Hons) గొప్ప వైణిక విద్వాంసుడు. బొంబాయి నగర మున నివాసముండుచు, కర్ణాటక, హిందీ గాన సాంప్రదాయముల యందు అభిజ్ఞ పాండిత్యము కల ఏకైక వీణావిద్వాంసుడుగా పేరొందినాడు. భార్య శకుంతల ఆమె సద్బ్రాహ్మణవంశస్థురాలు : ఈ దంపతులకు శోభారాణి, శరద్రాణి, విద్యారాణి యని మువ్వురు కుమార్తెలు : ప్రవీణుడని ఒక కుమారుడుడును కలరు.


రెండవ సంతానము లక్ష్మీకాన్తమ్మ. ఆమె ఊటుకూరి హయగ్రీవగుప్తగారి సతీమణి హయగ్రీవగుప్తగారు బాపట్లలో న్యాయవాది, వారికై దుగురు సంతానము. ప్రధమ పుత్రిక పోలేపల్లి సుహాసిని, అల్లుడు పోలేపల్లి హరనాథ్ B. Sc., (Ac). ప్రథమ పుత్త్రుడు ప్రతాప చంద్ర. ద్వితీయ పుత్త్రుడు రాజ రాజ నరేంద్ర. మూడవ కుమారుడు విజ్ఞానేశ్వరకుమారుడు, రెండవ కుమార్తె మైధిలీబాలాజీ. పుత్రికయైన లక్ష్మీకాన్తమ్మ ఉభయ భాషా ప్రవీణ పట్టభద్రురాలు, బహుకావ్యప్రణేత, వీణా వాదకురాలు, ఉపన్యాసవిశారద, ఆంధ్రదేశమునందే కాక యావ ద్భారతమునందును, తన బహుముఖ సేవా కార్యక్రమములతో సుప్రశస్తినందిన ధన్యజీవని - భారత ప్రభుత్వము వారి పంపున విదేశముల కేగి భారత సంస్కృతి ప్రచారమొనర్చినమిన్న ఆంధ్ర విశ్వవిద్యాలయము వారిచే కళాప్రపూర్ణ బిరుదమునందిన మేటి ప్రజ్ఞాశాలిని !

మూడవ సంతానము నాళము కామేశ్వరరావు B. Sc. ఛాయాగ్రాహక విద్యలో నిపుణుడు, ప్రశస్త వీణావాదనా నిపు