పుట:మధుర గీతికలు.pdf/397

ఈ పుట ఆమోదించబడ్డది

గ్రంథము - ప్రకృతి



లెమ్ము !లేలెమ్ము ! సోదరా లేచి రమ్ము :
కట్టిపెట్టుము చప్పిడి గ్రంథములను;
శ్రమముపడ నేల? సతతంబు చదివి చదివి?
పఱపు మొకసారి నీ దృష్టి ప్రకృతిదెసకు.

చూడు, మల్లదె సోదరా: సూర్యుఁ డెట్లు
నింగిపైనుండి నిరతంబు నేలపైకి
పచ్చనైనట్టి తన నులివెచ్చ కిరణ
పుంజముల జీమ్ముచున్నాడొ సంజవేళ.

అదిగో: యా గుజ్జుమామిడికొదమమీఁద
పాడుచున్నది కోయిల వేడు కలర;
ఓహొ! ఆ గాన మెంత మనోహరంబు:
గ్రంథములకన్న నందె విజ్ఞాన మలరు.

24