పుట:మధుర గీతికలు.pdf/393

ఈ పుట ఆమోదించబడ్డది

మృత్యువు సకలసమవర్తి




పదవి, సంపద, వంశంబు, వైభవంబు
శాశ్వతంబులు కా, వవి నశ్వరములు;
నృపుల శిరములపై నుంచు మృత్యుదేవి
చల్ల నగు తన మృదుహస్త పల్లవముల,

సార్వభౌముని కత్తి, కర్షకుని హలము
సమముగా రెండు నొకదానిసరస నొకటి
మృత్తులోపలఁ బొరలాడు; మృత్యుదేవి
అఖిలజీవుల నొకరీతి నాదరించు.

కైదువులఁ దాల్చి యోధులు కదనసీమ
రిపుల శిరములఁ గూల్తురు, మృత్యుదేవి
విజయు లగువారి శిరములఁ బ్రీతి మీఱ
తనదు బిగియారు బాహుబంధమునఁ బొదువు.

20