పుట:మధుర గీతికలు.pdf/391

ఈ పుట ఆమోదించబడ్డది

రాలిన పూలు


కన్నెయామనిసిరులకు వన్నెవెట్టు
మవ్వ మగు చిన్ని చిన్నారి పువ్వులార !
ఏల రాలెద రక్కటా! నేలమీఁద ?
ఏమి తొందరవచ్చె మీ కింతలోనె ?

ఏల పుట్టించె దేవుఁ డీ యిలను మిమ్ము ?
మింట తళుకని మెఱసెడి మెఱపులగతి
మూఁడు నాలుగు గడియల మురువు జూపి,
అంత తటుకున మటుమాయ మగుటకొఱక ?

మంచివారలు తాము జీవించియున్న
స్వల్పకాలములోననె వారి సుగుణ
సౌరభంబుల వెదచల్లి చనెద రనుచు
మీదు చరితంబు జగతికి బోధ సేయు.

18