పుట:మధుర గీతికలు.pdf/390

ఈ పుట ఆమోదించబడ్డది


జీవితం బను వార్ధివీచికలలోన
ఈఁదులాడుచు తలమున్క లిడుచునున్న
చకితమానసుఁ డా యడ్గుజాడలఁ గని
త్రాసమును మాని మదిని నుత్సాహ మొందు.

లెమ్ము- కర్మవీరుండవు' కమ్ము వేగ;
సరకు సేయక యెట్టి కష్టముల నైన,
నేర్పు మీఱఁగ కార్యముల్ నిర్వహించి
ఓర్మిమై వేచి ఫలసిద్ధి నొందు మయ్య.

ఎన్న మనుజుని జీవిత మేండ్లచేతఁ
గాక, యాతని ఘనకార్యగణముచేత
గణన సేయఁగఁ జెల్లును; కాకి వోలె
ఇలను నూరేండ్లు బ్రతికిన ఫలము కలదె?