పుట:మధుర గీతికలు.pdf/39

ఈ పుట ఆమోదించబడ్డది

28

సంస్కారోద్యమమునకు విముఖత కనబఱచినను, కాలక్రమమున నందలి ప్రయోజనమును తెలిసికొని, భర్తగారికనేక విధములుగా ఉద్యమ నిర్వహణమున సహకరించినది : ఆమె గాంధీ భక్తు రాలు : గాంధీగారి పిలుపు విని సత్యాగ్రహోద్యమమున నుఱికి ఎన్నో సేవా కార్యములు చేసినది. తన విదేశవస్త్రములను గాంధీ గారి ఎదుట తన యింటి ముందు వీధిలో దహనమొనర్చి వైచినది. పరమసనాతన ధర్మనిష్ఠతో నిత్యము విగ్రహపూజాదికమును నిర్వర్తించుచు, ఏకాదశీ ఉపవాసములతో, గోదావరీ స్నానము లతో, శాస్త్రోక్ర విధానమున, సకల వ్రతనియమములను సాంగో పాంగముగా సాగించిన ఆమె గాంధీగారి పిలుపు వీనులబడగానే, హరిజనులను ఇంటిలోని తన పూజామందిరము కడకు తీసుకొని వచ్చి వారిచే పూజ చేయించి, నూతిలో నీళ్లను తోడించి సనాతన మూఢవిశ్వాసములకు స్వస్తిపల్కిన ఉచితజ్ఞురాలామె :


నిత్యము చరఖాపై నూలువడికి ఆ నూలుతోనే తన చీరెలు నేయించుకొని, భర్తకు పంచెలు నేయించి, గాంధీగారికి ఏటా రెండు అంగవస్త్రములను పంపెడిది, ఏదైనా ఒక నియమమవ లంభించినచో, అతికఠోర నియమముతో ఆ వ్రతమును అకుంఠిత దీక్షతో పాలించు నియమశీలి ఆమె స్వయముగా సత్యాగ్రహో ద్యమమున పాల్గొనినది : ఆంధ్ర మహిళా గాన సభ యని స్త్రీల కొఱకొక గాన కళాశాల స్థాపించిన ఖ్యాతి ఆంధ్రదేశమున నామెకే దక్కినది.

ఈ పుణ్యదంపతులకు ఎనమండుగురు సంతానమైనను, కడక మిగిలినది ముగ్గురు మాత్రమే.