పుట:మధుర గీతికలు.pdf/386

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రశాంత జీవనము


భళిర : ఎంతటి ధన్యజీవనుఁ డతండు!
తరతరంబులు తన తాతతండ్రు లెల్ల
దున్ని సేద్యంబు చేసిన చిన్నిపొలమె
వాని లోకంబు, వాని సర్వస్వ మదియె.

పీల్చునాతఁడు పొలములో వీచు గాలి,
త్రావు నాతఁడు స్వచ్ఛమౌ బావినీరు,
క్రోలు నాతఁడు చిక్కని యాలపాలు,
క్రుంకు నాతఁడు చొక్కపు కొలనినీట.

చేలఁ బండిన గింజ లిల్లాలు వండి
కొసరి వడ్డింప కడుపార మెసవు నతఁడు
ప్రోదిగాఁ దాను పెంచిన పొదునుండి
అపుడె కోసిన కూరల నారగించు.

13