పుట:మధుర గీతికలు.pdf/385

ఈ పుట ఆమోదించబడ్డది


‘నెలత జీవించియున్నది నేఁడుఁ గూడ
అమెవదనారవింద మా సీమయందు.
కాంచవచ్చును కన్నులకఱవు దీర'
అంచు కొందరు జనులు వాదించుచుంద్రు.

'చిగురుటడుగుల మెల్ల నా యెగుడుదిగుడు
నేలపై మోపి, చూపులు నింగిఁ బఱపి,
వేడు కలరఁగ నాబాల పాడుచుండు
గాలి కెరటాల నాపాట యీలవెట్ట'

12