పుట:మధుర గీతికలు.pdf/384

ఈ పుట ఆమోదించబడ్డది


వేఁగుబోకను వా రొక్క వాగుదరిని
వెలయు నొక పెద్దమెట్టపై నిలిచియుండి;
రచటఁ గాంచిరి పొలమున కవల నున్న
కట్టెవంతెన నొకదాని నెట్టయెదుట.

కనుఁగొనియె తల్లి యా మంచుకరడులోన
అనుఁగుకొమరిత చిన్నారి యడుగుజాడ;
లేని ధైర్యము డెందమ్ములోన నూని,
వడిగ నేగిరి పొలమువెంబడిని వారు.

అచ్చుగుద్దినరీతి నా యడుగుజాడ
లన్నియును నొక్కపోలిక నమరియుండె;
వేయికన్నులఁ గనిపెట్టి వెంట నరిగి
కడకుఁ జేరిరి వంతెనకడకు వారు,

మంచు కప్పిన గట్టువెంబడిని వారు
ఒక్కటొకటిగ నా జాడ లుత్తరించి,
చనిరి వంతెన నడిమిపార్శ్వంబు దనుక;
అకట ! ఆజాడ లంతతో సంతరించె.

11