పుట:మధుర గీతికలు.pdf/382

ఈ పుట ఆమోదించబడ్డది


చెంగుచెంగున గుప్పించి చెంగలించు
కన్నెలేళ్లను దిలకింపఁగలవు, కాని
మురువు గులికించు నాకన్నె ముద్దుమొగము
గాంచఁజాలవు నీ వింక కానలోన.

'బాలరో : నేఁటిరేయి తుపాను వచ్చు,
పురమునకు నీవు వేగమే పోవవలయు;
చేత లాంతరు దాల్చి నీమాత నిటకు
తోడికొని రమ్ము మంచులో త్రోవ జూపి.'

'అట్లె కావింతు ముదమార ననుఁగుతండ్రి !
దెసల మలుసంజ యింకను మసలలేదు,
చదలిపై నింక రాలేదు చందమామ,
ప్రొద్దుగూకినయంతనె పోయి వత్తు

జనకుఁ డామాట లాలించి పనికిఁ బూని
కటైమోపుల విడఁదీయ క త్తి తీసి
కోయుచుండెను బిగివాళ్ళు; కొంతవడికి
కేల లాంతరు గీలించి బాల వెడలె.

9