పుట:మధుర గీతికలు.pdf/381

ఈ పుట ఆమోదించబడ్డది

లూసీ గ్రే


విందు వేమఱు వీనుల విందు లలర
సుగుణములరాసి, 'లూసి' యన్ ముగుద గూర్చి;
ప్రొద్దుపొడుపున నాబాల ముద్దుమొగము
కాన దాటినయపు డెల్లఁ గాంచుచుందు.

ఒప్పులన్నియు నొకచోట కుప్పవోసి,
అందముల నెల్ల నొకచక్కి పొందుపరచి
చేసెఁ గాఁబోలు బమ్మ యా లూసిమోము,
అట్లు గాకున్నఁ గలుగునే యట్టి హొయలు.

కోనలో కొండదరి నున్న గుడిసెయందు
కాపురము సేయు నొంటిగా కన్నెమిన్న;
కట్టెలను కొట్ట జనకుండు కాన కేగు,
పుల్ల లమ్మఁగ నగరికిఁ బోవు తల్లి.

8