పుట:మధుర గీతికలు.pdf/38

ఈ పుట ఆమోదించబడ్డది

27

లైన శ్రీ కంచుమర్తి రామచంద్రరావుగారు, శ్రీకృష్ణరావుగారి పక్షమున నిలువబడి, ప్రస్తుతము గ్రంథాలయమున్న ప్రదేశము నందే గ్రంథాలయమును నెలకొల్పుటకు శ్రీ కృష్ణరావుగారికి సహాయపడుటయే కాదు - ఆర్ధికముగా కూడ సహాయపడిరి. తరు వాత, తనయొద్దగల బంగారు వస్తువులను అమ్మియు, కొంత ఉదారులైన వారి ఆర్ధిక సహాయమును స్వీకరించియు శ్రీరామ చంద్రరావుగారి అప్పును తీర్చి వేసి, గ్రంథాలయమునకు కృష్ణరావు గారు స్వతంత్ర భవన ప్రతిపత్తిని గల్పించిరి.


శ్రీకృష్ణరావుగారి షష్టిపూర్తి సమయమునకు వారి పెద్ద కుమారుడు నాగేశ్వరరావు గ్రంథాలయ కార్యదర్శిగా నుండెను. ఎంతో గొప్ప వైభవముతో ఆంధ్రదేశమునందలి పెద్దలు, గ్రంథా లయోద్యమము వారు పాల్గొని షష్టిపూర్తిని జరిపించిరి.


ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమమునకు శ్రీ అయ్యంకి వెంకట రమణయ్యగారు పితామహులు, శ్రీకృష్ణరావుగారు తొలి కార్యదర్శి,


శ్రీకృష్ణరావుగారి అర్ధాంగి, ధర్మపత్ని, శ్రీమతి నాళము సుశీలమ్మగారు ఆమె జమీందారులైన శ్రీ మోతే వెంకట కృష్ణయ్యగారి ద్వితీయ కుమార్తె, శ్రీ మోతే కృష్ణరావుగారి సోదరి : సత్యాగ్రహోద్యమ నాయకుడైన శ్రీ మోతే నారాయణ రావుగారి మేనత్త - బహుదాన ధర్మకార్యములొనర్చిన శ్రీ మోతే.. గంగరాజుగారీమెకు పినతండ్రి - సన్నుతాచార శీలయైన సుశీలమ్మ గారు మిక్కిలి విజ్ఞురాలు ! మొదట్లో కృష్ణరావు గారి సంఘ