పుట:మధుర గీతికలు.pdf/378

ఈ పుట ఆమోదించబడ్డది

ఒంటరి పల్లెపిల్ల


అల్లదే చూడు, మొంటిగా పల్లెపిల్ల
సాయ మెవరును లేకయే సంజ వేళ
చేలు దున్నుచు గింజలు నేలఁ బాతి,
పాడుచున్నది మ్రోఢులు పల్లవింప.

సద్దు సేయక మెల్లగా సాగు మోయి-
సేవ్య మొనరించి ఆబాల శ్రావ్యముగను
ఏదొ యొక్క ప్రశాంత విషాదగీతి
ఆలపించుచునున్నది, ఆలకింపు.

భువనమోహన మైన యా ముగుదపాట
వేణునాదముకన్నను వీణకన్న
హాయి గొలుపుచు, నా పొంతలోయనుండి
మాఱుమ్రోగుచు వినిపించు మరల మరల.

5