పుట:మధుర గీతికలు.pdf/376

ఈ పుట ఆమోదించబడ్డది

నా యిల్లు


నందనంబులు, సుందరమందిరములు
ఈడువచ్చునె నా సొంతయింటితోడ ?
అదొక పూరికుటీరమే యగును గాక,
స్వర్గమైనను దానితో సాటి రాదు.

చిన్నతనమున కూర్మినెచ్చెలులతోడఁ
గూడి వేడుకమీఱ నే నాడినట్టి
ఆటపాటల మఱువంగ నలవి యగునె ?
గృహముకంటెను సౌఖ్యంబు మహిని లేదు.

అనుఁగుతల్లియు తండ్రియు నన్నదమ్ము
లక్కచెల్లెండ్రు నాతోడ నాడినట్టి
మధురభాషల వెన్నడు మఱువఁగలనె ?
గృహముకంటెను సౌఖ్యంబు మహిని లేదు.

3

>