పుట:మధుర గీతికలు.pdf/374

ఈ పుట ఆమోదించబడ్డది

నా జన్మభూమి


అది మనోహర, మతిమహిమాన్వితంబు,
సౌఖ్యభరితంబు, సౌందర్యసంయుతంబు,
సకలసంపత్సమేతంబు, శాశ్వతంబు
స్వర్గసన్నిభసీమ నా జన్మభూమి.

పాడిపంటల కయ్యది పట్టుకొమ్మ,
భోగభాగ్యములకు నది పుట్టినిల్లు,
అఖిలశుభముల కయ్యది ఆటపట్టు,
స్వర్గసన్నిభసీమ నా జన్మభూమి.

అనవరతమును ప్రవహించు నచటి నదులు,
అన్ని వేళల ఫలియించు నచటి వనులు,
అఖిలమణులకు నాకర మచటి గనులు,
అంబరంబును చుంబించు నచటి గిరులు.