పుట:మధుర గీతికలు.pdf/371

ఈ పుట ఆమోదించబడ్డది


కరము కరమునఁగీలించి తరుణి, ప్రియుఁడు
ప్రభుని పదముల నెఱగిరి భక్తి గదుర,
'శీఘ్రమే మీకు కళ్యాణసిద్ధి రస్తు'
అనుచు దీవించె భూవరుఁ డధికదయను.

రేయి యెల్లను తమ్మిపూరేకు లనెడి
చెఱలలోఁ జిక్కి స్రుక్కి కృశించియున్న
యళులబంధము లెడలించి యార్తిదీర్చి
మిహిరబింబము పూర్వాద్రిమీఁదఁ బొడిచె.

64