పుట:మధుర గీతికలు.pdf/370

ఈ పుట ఆమోదించబడ్డది


తోడనే లేచి చేదోయి దోయిలించి
చినుఁగువలువలు, నొగిలినతనువు జూసి
జాలి గులుకఁగ గద్గదస్వరముతోడ
వెలఁది ప్రభునకు సర్వంబు విన్నవించె.

రమ్య మయ్యును క్లేశభారమ్ముచేత
వన్నె దిగఁద్రావి వసివాళ్ళు వాఱియున్న
తమణిముఖబింబ మవలీల కఱఁగఁజేసె
వజ్రసన్నిభ మైన యా ప్రభుని మనము.

“పడఁతి ! ఎంతటి కష్టముల్ పడితి వమ్మ ?
పావనం బగు తావక ప్రణయమహిమ
ప్రియునిఁ గాపాడె, నీ వింక భయము మాని
ప్రేమ లహరిని దేలుమా ప్రియునిఁ గూడి.”

అనుచు నీరీతి భూవరుఁ డానతిచ్చి
అధికదియతోడ నాయింతి నాదరించి
భటుని నొక్కని వేగమె పంపి యామె
ప్రియుని చెరనుండి విడిపించి ప్రియము నించె.

63