పుట:మధుర గీతికలు.pdf/37

ఈ పుట ఆమోదించబడ్డది

26

"అంతర్లీనమై యున్న భాషా తీవ్రతను అణచుకోలేక, అత్తవారిచ్చిన విలువ గల వస్తువులన్నీ తెగనమ్మి తన పదు నైదవ యేట, ప్రప్రధమాంధ్ర గ్రంథాలయాన్ని 'వీరేశలింగ గ్రంథాలయం' అనే పేరుతో స్థాపించి భాషారాధనతో మానవ సేవ చేసిన మహనీయుడు !"


గురుశిష్యులిద్దఱూ (పంతులుగారూ, కృష్ణరావుగారూ) తీవ్రంగా విభేదాలు వచ్చి కోర్టుల కెక్కినా కృష్ణరావుగారి నిజా యితీ, చిత్తసంస్కారమూ, నిష్కళంకమైన సేవా శీలమూ పంతులుగారికి బాగుగా తెలియును. కాబట్టే తాను చనిపోవునపుడు, తన వీరేశలింగోన్నత ఆస్తిక పాఠశాలకూ, హితకారిణీ సమా జమునకు శ్రీ కృష్ణరావుగారినే అధ్యక్షునిగా నియమించుట జరిగి నది – హితకారిణీ సమాజమునకు, శ్రీకృష్ణరావుగారే ఆజీవి తాధ్యక్షులు ! అట్లే గౌతమీ గోరక్షణ సంఘమునకు వారే అధ్య క్షులు : ఇంక సరేసరి గౌతమీ గ్రంధాలయమునకు, సంస్థాపకులు, సంచాలకులు, నిర్వాహకులు, బంట్రోతు, అధ్యక్షుడు - అన్నియు ఆయనయే.


గౌతమీ గ్రంథాలయమునకు స్థిరమగు భవన వసతి కల్గించు సందర్భముల యందు గ్రంథాలయము పురమధ్యమున నుండవలెనా ? ఊరిచివరనుండవలెనా? యను విషయమున పుర ప్రముఖులకు, కృష్ణరావు గారికి పెద్ద వివాదము జరిగినది. ఆది కోట - వేట సంవాదముగా రాజమహేంద్రవర నగరమున పెద్ద సంచలనమును లేవదీసినది. ఆ వివాదమునందు పురప్రముఖు