పుట:మధుర గీతికలు.pdf/369

ఈ పుట ఆమోదించబడ్డది


బళ్లుమని యంత నల్లదే తెల్లవాఱె,
ఓహొ! ఏమి యా జనుల కోలాహలంబు ?
ఆతఁడెవ్వఁడు? ముందుగా హయము నెక్కి
వడి హుటాహుటినడలతో వచ్చుచుండె.

గంటపై నాని యుంచిన కరము దిగిచి
పగ్గమన రెండుచేతులు బిగ్గఁ గూర్చి
గుప్పుమని జాఱి నేలపై కుఱికె కలికి
మింటిపైనుండి తెగివడ్డ మినుకు వోలె.

కాఱుమబ్బులనుండి క్రొక్కారుమెఱుఁగు
కరణి, చిమ్మచీకటినుండి తరణి వెడలి
పరుగుపరుగున సరగున సరుగు దెంచి
ఱేనిపదముల పైఁ దనమేను జేర్చె.

కాఱుచున్నట్టి కన్నీటిజాలు చేత
దొరఁగి స్రవియించు చెమట బిందువులచేత
ఏఱులై పాఱు నెత్తురుధార చేత
కడిగె తొయ్యలి ప్రభుపాదకమలయుగళి.

62