పుట:మధుర గీతికలు.pdf/368

ఈ పుట ఆమోదించబడ్డది


తెంపుతో నిట్లు ఘోర ప్రతిజ్ఞ చేసి
ఒక్కచేతను త్రాడు, వేఱొక్కచేత
బలిమిమై గంట గట్టిగాఁ బట్టుకొనుచు
వ్రేల నుంకించె తొయ్యలి రేయి యెల్ల.

త్రాణతో రెండు చేతుల త్రాడుబట్టి
లాగుచుండెను గంటవా డాగకుండ,
గంట మ్రోగుచున్నది గాఁదలంచె
పాపమాతఁడు వినలేఁడు బధిరుఁ డగుట.

తన కరంబులు వడవడ వణఁకుచున్న
పడతి తన చేతిపట్టు తా విడువ దయ్యె,
హృదయ మదవదయై కడు బెదరుచున్న
నదరు పెదవుల ని ట్లామె వదరుచుండె:

“ఉసురు లీ బొందిలో నిల్చియున్న దాక
పెనఁగి నెట్టిన నా పట్టు విడువజాల,
వేఁగుజా మైన నగుఁగాక, వ్రేలుదాన
ఏది యెటు లైన గంట వాయింపనీయ.

61