పుట:మధుర గీతికలు.pdf/366

ఈ పుట ఆమోదించబడ్డది


కాలుసేతుల ర క్తంబు కాల్వగట్టి
జాలువాఱుచు నున్నను సరకుగొనక
మీఁది కెగఁబ్రాకుచుండె నమ్మెలఁత, యౌర !
వలపు గలచోట ప్రాణంబు చులుక గాదె ?

అల్లిబిల్లిగ లో నెల్ల నల్లికొనిన
చెలఁదిగూఁడులు చీకాకు గొలుపుచున్న,
కటికిచీఁకటిగొందిలో కట్టకడకు
చేరుకొనె నామె యెటో శిఖరమునకు

శిరముపై నున్న గంటను చేతఁ దడవి
ఉస్సు రని యామె యొక్క నిట్టూర్పు పుచ్చ;
ముందు గనిన గుయ్యారంబు, క్రిందఁ గనిన
నంతకంటెను గుయ్యార మగుచుఁ దో(చె.

అదిగో ! అది యేమి ? యా త్రాడు కదలుచుండె ?
దరిసెఁ గాఁబోలు తన ప్రియు మరణవేళ ;
ఏమి యొనరింపవలయునో యామె మఱచె,
చిత్తురువు రీతి నూఁగాడె చేష్ట లుడిగి.

59