పుట:మధుర గీతికలు.pdf/365

ఈ పుట ఆమోదించబడ్డది


చాలకాలమునుండియు స్వామియాజ్ఞ
నెఱపుచుంటిని, నేఁడును నెఱుపువాఁడ.
ఏది యెటులైన - గంటవాయింప మాన”
అనుచు వచియించె వృద్ధుఁడు వ్యగ్రుఁ డగుచు.

పిడుగు బోలిన యా మాట వినినయంత
ఉల్లమున నామె యెంతయు తల్లడిల్లి
మొదలు నఱకిన కర్పూరకదళి వోలె
నేలపై నొక్క పెట్టున కూలఁబడియె.

తెప్పిఱిలి కొంతవడి కామె తేఱి లేచి
తటుకు మని యొక్క యోచన తట్ట మదికి,
గంట వ్రేలాడు గోపురాగ్రంబుకడకు
నిట్టనిలువున నెగఁబ్రాఁక నిశ్చయించె

గంట లోపలి గుండునఁ గట్టియున్న
త్రాడు క్రిందికి వ్రేలాడ, దాని నామె
గట్టిగా రెండుచేతులఁ బట్టి, మీఁది
కెక్క నుంకించె, నయ్యారె ! ఎట్టి తెంపొ ?

58