పుట:మధుర గీతికలు.pdf/363

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రణయ మహిమ


ఒక విషాదదినంబున నువిద యొకతె
యేమొ యోచించుకొనుచుండె, నామెవదన
మొక్కపరి గాఢనిస్పృహ, మొక్కసారి
యించుకించుక యాశ సూచించుచుండె.

తాను మనసార వలచిన తరుణుఁ డొకఁడు
నాఁటిరాతిరి చెఱవెన్క తోఁటయందు
ప్రభునియానతి సురిదీయఁబడఁగ నుండె,
ఖంగు మని గంట మ్రోఁగిన క్షణమునందె

పుడమి కెల్లను బంగారు పూత పూసి
అరుణబింతము చరమాబ్ధి నస్తమించె;
రమణి యంతట తన మందిరమును వీడి
రయమునం జని బంధనాలయముఁ జొచ్చె.

56