పుట:మధుర గీతికలు.pdf/36

ఈ పుట ఆమోదించబడ్డది

25

'విక్రమాబ్దంలో పుట్టి ధర్మం కొఱకు, సత్యం కొఱకు, న్యాయం కొఱకు విక్రమించిన మహాధర్మపరుడీ మహానుభావుడు.'


'జీవితమంతా సంఘర్షణతోను, విప్లవాలతోను గడిపిన నెఱజోదు : దేశ సేవలోను, సంఘ సేవలోను, భాషా సేవలోను కాకలు తీరిన, మహానాయకుడు కష్టాల్లో ఉన్న వారిని, కవి పండితులను ఒక్కరీతిగా ఆదరించి ఆదుకున్న ధర్మదాత ఎంత నిరాడంబరుడో, అంతదీక్షావైష్ఠికుడు ఎంతరసికుడో, అంత శీల దక్షుడు ఎంతకళామయుడో, అంత ఛాందసుడు: ఎంతకర్మ వీరుడో, లౌకిక ప్రవృత్తిలో అంత అమాయకుడు : ఇట్టి విరుద్ధ, విచిత్ర, విశుద్ద, ధర్మగణాల వింతి సంపుటియే మధురకవి నాళము కృష్ణరావు !”


“నిజమైన ఈశ్వర సేవ, సంఘ సంస్కారము, మహి ళోద్ధరణములో నున్నదని గ్రహించి వితంతు వివాహాదికములలో శ్రీ వీరేశలింగముగారికి కుడిభుజమై పనిచేసిన మహాను భావుడీయన"


“తన సోదరులెన్ని కష్టాలు పెట్టినా, ఇల్లాలికెంత ఇష్టంలేక పోయినా, అత్తవారెంత బ్రతిమలాడుకొని, ఎంత డబ్బు ఆశ చూపినా, లోకులాఖరికి వెలివేసినా, జంకకుండా బ్రాహ్మధర్మ వ్రతానుష్ఠానాన్ని స్వీకరించి, అందఱ కంటె ముందుగా జందెం తీసివేసి సర్వకులమతసమాన విందు నేర్పాటు చేసిన సంఘ సంస్కారి"