పుట:మధుర గీతికలు.pdf/359

ఈ పుట ఆమోదించబడ్డది


విసిగి వేసారి మొగ మట్టె వేలవైచి
నిస్పృహంబున నతఁడు చింతించు చుండ,
సాలెపురు గొండు పోఁగున వ్రేలియాడి
తటుకు మని వాని దృష్టిపథమునఁ బడియె.

దానిఁ బొడఁగనినంతనే ధరణివిభుఁడు
తనదు యోచన యొక్కింత తడవు మాని,
లూత యేమి యొనర్చునో చూత మనుచు
దానిచర్యలఁ గనుచుండె తమక మొప్ప.

గుడి సెనడికొప్పునం దున్న గూఁడునుండి
నూలు వెంబడి సాలీఁడు వ్రేలుచుండె;
“చేరునా యది తనయిల్లు ? చేరలేక
అల్లలాడున నావలె నిల్లు దొరఁగి ? "

అనుచు నా రాజు వింతగా నరయుచుండ,
సాలెపురు గట్టె పోఁగున వ్రేలియాడి
చీటిమాటికి పదముల జిమ్ముకొనుచు
కడఁకమై మీఁది కెగఁబ్రాఁకఁ గడఁగుచుండె.

52